LATEST UPDATES

Monday 24 June 2024

ఆంధ్రప్రదేశ్ మైదానాలు (Plains in Andhra Pradesh)

 ఆంధ్రప్రదేశ్ లో గల మైదానం --> కోస్తా తీర మైదానం.

తూర్పు తీర మైదానం ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది

ఈ మైదానంలో అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రునేలలు ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వ్యవసాయం లో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.

గోదావరి, కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేటవేయటం వల్ల ఈ డెల్టా మైదానం ఏర్పడింది.

గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి, మరియు చెరకు, వరి, పసుపు, మిర్చి పంటలకు ప్రసిద్ధి.

గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో కల నల్ల రేగడి నేలలు మిరప, ప్రత్తి పంటలకు ప్రసిద్ధి.

ఈ డెల్టా ప్రాంతాన్ని దక్షిణ భారత దేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.

ఈ మైదాన ప్రాంతం లో ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు (మంచినీటి సరస్సు), పులికాట్ సరస్సు (ఉప్పునీటి సరస్సు) ఉన్నాయి.

కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, పులికాట్ సరస్సు ఎస్.పి.ఎస్.ర్ నెల్లూరు జిల్లాలోనూ కలవు.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates