v ఆంధ్రప్రదేశ్ లో గల మైదానం --> కోస్తా తీర మైదానం.
v తూర్పు తీర మైదానం ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది.
v ఈ మైదానంలో అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రునేలలు ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వ్యవసాయం లో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
v ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
v గోదావరి, కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేటవేయటం వల్ల ఈ డెల్టా మైదానం ఏర్పడింది.
v గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలు సారవంతమైన నేలలకి, మరియు చెరకు, వరి, పసుపు, మిర్చి పంటలకు ప్రసిద్ధి.
v గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో కల నల్ల రేగడి నేలలు మిరప, ప్రత్తి పంటలకు ప్రసిద్ధి.
v ఈ డెల్టా ప్రాంతాన్ని దక్షిణ భారత దేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.
v ఈ మైదాన ప్రాంతం లో ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సు (మంచినీటి సరస్సు), పులికాట్ సరస్సు (ఉప్పునీటి సరస్సు) ఉన్నాయి.
v కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, పులికాట్ సరస్సు ఎస్.పి.ఎస్.ర్ నెల్లూరు జిల్లాలోనూ కలవు.